Home సినిమా అఖండ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు…ఇంతకీ బాలయ్యతో కలిసి నటించే అవకాశం ఎలా వచ్చిందో తెలుసా…

అఖండ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు…ఇంతకీ బాలయ్యతో కలిసి నటించే అవకాశం ఎలా వచ్చిందో తెలుసా…

0

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా రిలీజ్ అయినా చిత్రం అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.అఖండ సినిమాలో తమన్ మ్యూజిక్ మరో హై లెట్ అని చెప్పచు.ఈ సినిమాకు గాను తమన్ అందించిన బ్యా గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలోని ముఖ్య పాత్రలలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి.ఈ పాత్రకు సినిమాలో చాల ప్రాముఖ్యత ఉందని చెప్పచ్చు.ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పాప బేబీ దేష్ట చాల అద్భుతంగా నటించిందని చెప్పాలి.

దేష్ట తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.బాలకృష్ణ ఇటీవలే బేబీ దేష్ట ను ముద్దు చేస్తున్న వీడియొ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బాలకృష్ణ గారు బేబీ దేష్ట గురించి ఆమె నటన గురించి ప్రశంసల వర్షం కురిపించిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా దేష్ట తల్లితండ్రులు ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ముందుగా దేష్ట ఇంస్టాగ్రామ్ ద్వారా నిర్మాతలకు కనెక్ట్ అయ్యి ఆ తర్వాత బోయపాటికి పరిచయం అయ్యిందని దేష్ట తల్లితండ్రులు చెప్పారు.

ఆ సినిమాలో పాపకు మంచి క్యారెక్టర్ ఇచ్చి మాటలు కూడా సరిగ్గా రాని పాపతో బోయపాటి అద్భుతంగా యాక్టింగ్ చేయించారు అని తెలిపారు.మొదటి సినిమాతోనే పాప కు మంచి పేరు రావడం చాల సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేసారు.బాలకృష్ణ గారు కూడా దేష్ట తో చాల ఫ్రెండ్లీ గా ఉంటూ తమను కూడా కుటుంబసభ్యులు లాగా చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు.ఇంత మంచి అవకాశం తమ పాప కు ఇచ్చినందుకు దర్శకుడు బోయపాటి కి ధన్యవాదాలు తెలిపారు.తమ పాపకు బాలకృష్ణ గారితో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసారు.ఈ సినిమా ద్వారా తమ పాపకే కాకుండా తమకు కూడా చాల గుర్తింపు వచ్చిందని తెలిపారు.ఈ సినిమా ను తప్పకుండ అందరు చూసి తమ పాప నటన ఎలా ఉందొ తెలపాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here