నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీనుల కంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం అఖండ ఇటీవలే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2 న రిలీజ్ అయినా ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది.ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడిగా నటించారు.ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది.ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజం:12 .10 కోట్లు, సీడెడ్:9 .50 కోట్లు, ఉత్తరాంధ్ర:3 .77 కోట్లు, ఈస్ట్:2 .58 కోట్లు, వెస్ట్:2 .05 కోట్లు, గుంటూరు:3 .24 కోట్లు
కృష్ణ:2 .26 కోట్లు, నెల్లూరు:1 .70 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ:36 .75 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా మరియు ఓవర్సీస్:7 .80 కోట్లు, వరల్డ్ వైడ్ మొత్తం:44 .55 కోట్లు.
ఈ చిత్రానికి సంబంధించిన థియరిటికల్ బిజినెస్ రూ.53 .25 కోట్ల జరిగింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 54 కోట్లు షేర్లు రాబట్టాలి.మొదటి వీకెండ్ కి రూ.44 .55 కోట్లను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.9 .45 కోట్ల షేర్లు రాబట్టాల్సి ఉంది.