నందమూరి బాలకృష్ణ హీరోగా,బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం అఖండ రిలీజ్ అయ్యి వారం రోజులు అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.అఖండ చిత్రం బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ చిత్రం అఖండ విజయంతో దూసుకుపోతుంది.ప్రగ్య జైస్వాల్ ఈ చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
మరో పక్క తమన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి బాగా హైలెట్ అవడం జరిగింది.వరదరాజులు అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ కూడా బాగా ఆకట్టుకున్నారు.వీకెండ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.బ్రేక్ ఈవెన్ కు చిన్న ఇంచ్ దూరంలో ఉంది ఈ చిత్రం.అయితే ఏపీలో మాత్రం ఇంకా రాబట్టాల్సి ఉందని అంచనా.అఖండ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…
నైజం:14 .90 cr ,సీడెడ్:10 .92 cr ,ఉత్తరాంధ్ర:4 .55 cr ,ఈస్ట్:3 .01 cr ,వెస్ట్:2 .48 cr ,గుంటూరు:3 .62 cr ,కృష్ణ:2 .71 cr ,నెల్లూరు:1 .98 cr ,ఏపీ మరియు తెలంగాణ:44 .25 cr ,రెస్ట్ అఫ్ ఇండియా మరియు ఓవర్సీస్:8 .90 cr ,వరల్డ్ వైడ్ మొత్తం:53 .15 cr .ఈ చిత్రానికి 53 .25 థియరిటికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 54 కోట్లు షేర్లు రావాలి.అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 0 .85 cr షేర్లు రాబట్టవలసి ఉంది.ఏపీ లో ఈ వీకెండ్ భారీగా కలెక్ట్ చేస్తేనే అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించగలుగుతుంది.అయితే ఈ వీకెండ్ అఖండ కు చాల కీలకమని చెప్పచ్చు.