Home » సినిమా » వామ్మో…అఖండ మూవీలో బాలయ్య వాడిన విగ్గు ఖరీదు అన్ని లక్షలా..

వామ్మో…అఖండ మూవీలో బాలయ్య వాడిన విగ్గు ఖరీదు అన్ని లక్షలా..

ఇటీవలే రిలీజ్ అయినా అఖండ సినిమా ఘన విజయం సాధించటంతో నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను చాల సంతోషంగా ఉన్నారు.అటు అఖండ చిత్ర యూనిట్ తో పాటు బాలయ్య అభిమానులు కూడా ఈ సినిమా హిట్ అవడంతో పండగ చేసుకుంటున్నారు అనే చెప్పచ్చు.ఇదివరకు బోయపాటి,బాలయ్య కంబినేషన్లో వచ్చిన రెండు చిత్రాలు కూడా హిట్ అవడంతో వారిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అనుకున్నట్టుగానే హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

అయితే ఇది ఇలా ఉంటె అఖండ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించడం జరిగింది.మురళి కృష్ణ అనే పాత్రలో బాలకృష్ణ చాల అందంగా కనిపించారు.అలాగే అఖండ అనే పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించారు బాలయ్య.బాలయ్యను సినిమాలో ఎలా చూపించాలో దర్శకుడు బోయపాటికి తెలిసినంతగా మరి ఎవ్వరికీ తెలీదు అని చెప్పచ్చు.ఇప్పటి వరకు బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మూడు సినిమాల్లోనూ ఆయన చాల అందంగా కనిపించారు.అయితే అఖండ సినిమాలో బాలకృష్ణ అందం వెనుక కారణం విగ్గు కూడా అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం కోసం మూవీ మేకర్స్ బాలకృష్ణ విగ్గు కోసం ఆయన అందంగా కనిపించటానికి ఏకంగా 50 లక్షలు ఖర్చు చేసారని సమాచారం.మేకర్స్ బాలయ్య కోసం 39 లక్షలు పెట్టి మూడు విగ్గులు కొన్నారని వార్తలు వస్తున్నాయి.మురళి కృష్ణ అనే పాత్ర కోసం ఈ మూడు విగ్గులను కూడా ఉపయోగించారట.అలాగే బాలయ్య లుక్ కోసం ముంబై నుంచి భారీ రెమ్యూనరేషన్ తో హెయిర్ స్టైలిష్ లను కూడా పిలిపించారట.బాలకృష్ణ హెయిర్ స్టైలిస్ట్ కు 12 లక్షలు చెల్లించినట్లు సమాచారం.మొత్తం మీద మూడు విగ్గులు మరియు హెయిర్ స్టైలిష్ పారితోషకం మొత్తం కలిపి 50 అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *