సమంత ఆరోగ్యంపై స్పందించిన అఖిల్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..!

అక్కినేని కుటుంబం నుంచి బయటకు వచ్చిన సమంత ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక కొంత కాలం నుంచి ఆమె కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తుంది. సామ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని, అందుకే బయటకు రావడం లేదని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సమంత రీసెంట్ గా తీసిన ఒక యాడ్ లో ఆమె ముఖంలో స్పష్టమైన మార్పులు కూడా కనిపంచాయి అంటున్నారు ఆమె అభిమానులు. సర్జరీ కోసమే యూఎస్ వెళ్లిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపై ఆమె ఇంతకాలం స్పందించలేదు. ఈ మధ్య ఆమె తన అనారోగ్య విషయాలను పంచుకుంది. తాను ‘వయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని, ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని ఓపెన్ అయ్యింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే వైద్యుల సూచనల మేరకు షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్తోంది. ఆమె ప్రస్తుతం ‘యశోద’ మూవీ చేస్తుంది. తానే డబ్బింగ్ చెప్పుకున్న ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇండస్ర్టీ కూడా సామ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. 

సామ్ పోస్టును చూసిన ‘అఖిల్ అక్కినేని’ స్పందించారు. అందరి ప్రేమాభిమానంతో సమంత త్వరగా కోలుకుంటారని అఖిల్ రీ పోస్ట్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లలో కొందరు నాగచైతన్య ఇంత వరకూ ఎందుకు స్పందించ లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కినేని కుటుంబం నుంచి స్పందన రావడం ఒకరకంగా మంచిదే అంటూ భావిస్తున్న వారూ ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *