Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఒకవైపు రాజకీయాలతో పాటు మరోవైపు వరుసగా సినిమాలు పూర్తి చేస్తున్నారు పవన్.వినోదయ సీతం తెలుగు రీమేక్ లో ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న పవన్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ సినిమాలతో పాటు సాహో డైరెక్టర్ సుజిత్ తో కలిసి OG ఒరిజినల్ గ్యాంగస్టర్ సినిమా చేస్తున్నారు పవన్.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబై లో లాంఛనంగా స్టార్ట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే కొన్ని సీన్లు కూడా పవన్ పై షూట్ చేయడం జరిగింది.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో పవన్ కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడు అనే ఒకే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పవన్ తో పాటు అకిరా నందన్ కూడా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు పూనకాలే అని చెప్పచ్చు.
ఇక ఈ సినిమాలో పవన్ మూడు విభిన్న పాత్రలలో కనిస్తారు అనే వార్త కూడా వినిపిస్తుంది.ఇందులో ఒకటి మాఫియా డాన్ పాత్ర మరొకటి కాలేజీ లెక్చరర్ పాత్ర అని వినిపిస్తుంది.టీనేజీ కుర్రాడిలా కూడా పవన్ కనిపిస్తున్నారని ఇక ఈ పాత్ర కోసం సుజిత్ అకిరా నందన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.ఈ విషయం పై పవన్ కళ్యాణ్ తో కూడా సుజిత్ త్వరలో మాట్లాడనున్నారు అని టాక్ నడుస్తుంది.ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చెప్పి ఇదే నిజం అయితే అకిరా నందన్ కి ఇది డెబ్యూ మూవీ అవుతున్నదని చెప్పచ్చు.