తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిండునూరేళ్ళు,సీతాకోకచిలుక వంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు కమెడియన్ అలీ.ఆ తరవాత మంచి మంచి సినిమాలతో టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.కమెడియన్ గానే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అలీ.బుల్లితెర మీద ప్రసారం అవుతున్న పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు అలీ.అలీ భార్య పేరు జుబేదా అలీ.ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు.అలీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నాడు.
అలీ పెద్ద కూతురు ఈ మధ్యనే డాక్టర్ పట్టా పొందడం జరిగింది.తాజాగా అలీ పెద్ద కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకలు చాల ఘనంగా జరిగాయి.సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అలీ భార్య జుబేదా గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల వీడియోలు,హోమ్ టూరు వీడియోలు వంటివి చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నారు.
ఇప్పటి వరకు ఈమె ఛానల్ కు అయిదు లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉండటం విశేషం.ఇటీవలే ఆమె పెద్ద కూతురు నిశ్చితార్ధం అంటూ షాపింగ్ వీడియోలతో ఆకట్టుకోవడం జరిగింది.ఈ వీడియోలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఇక ఈ వేడుక ఎప్పుడు జరుగుతుంది అంటూ అందరిలోనూ బాగా ఆసక్తి నెలకొంది.అలీ పెద్ద కూతురి నిశ్చితార్ధం ఒక ఫంక్షన్ హల్ లో చాల గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకు బ్రమ్మానందం,సాయి కుమార్ వచ్చి ఆశీర్వదించడం జరిగింది.ఈ వేడుకకు సంబంధించిన వీడియొ ను జుబేదా అలీ తన యూట్యూబ్ ఛానల్ లో అభిమానులతో షేర్ చేసుకున్నారు.ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వీడియొ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.