సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది నటి నటుల వ్యక్తిగత విషయాలు,చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.నటి నటుల చిన్ననాటి ఫోటోలు మరియు రేర్ ఫోటోలు చూడడానికి అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు.ఈ క్రమంలో టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల హీరో,హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి.ఇప్పటికే దాదాపుగా చాల మంది స్టార్ హీరోయిన్ల కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రతి రోజు కనిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన క్యూట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.మొదటి సినిమాతోనే తన అందంతో,అభినయంతో ఈ హీరోయిన్ కుర్రాళ్ళ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ హీరోయిన్.ఈ ఫొటోలో క్యూట్ గా ఉన్న చిన్నారి ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.బాలీవుడ్ లో చాల సూపర్ హిట్ సినిమాలలో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అలియా భట్.
ఈమె ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది.ట్రిపుల్ ఆర్ సినిమాలో సీత పాత్రలో హీరో రామ్ చరణ్ కు జోడిగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది అలియా భట్.ప్రస్తుతం అలియా భట్ బ్రహ్మస్త్ర,రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని,హార్ట్ ఆఫ్ స్టోన్ వంటి చిత్రాలతో బిజీ గా ఉంది.ఈ ఏడాది ఏప్రిల్ 14 న తాను ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరో అయినా రన్బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది ఈ ముద్దు గుమ్మా.