Home సినిమా Ugram OTT: ప్రముఖ OTT లో అల్లరి నరేష్ ఉగ్రం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Ugram OTT: ప్రముఖ OTT లో అల్లరి నరేష్ ఉగ్రం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే

0
allari naresh movie ugram ott release date june 2
allari naresh movie ugram ott release date june 2

Ugram OTT: అల్లరి నరేష్ హీరోగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా ఉగ్రం మే 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు నుంచే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయికో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.

ఈ సినిమాకు అల్లరి నరేష్ మరోసారి నటనాపరంగా సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.నాంది సినిమా హిట్ తర్వాత అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకులను అలరించారు.నరేష్ కు జోడిగా మిర్న హీరోయిన్ గా నటించారు.నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.

షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనాపరంగా ఉగ్రరూపం చూపించి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఎప్పుడు కామెడీ తో అలరించే నరేష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రలో కనిపించటం జరిగింది.మే 5 న థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఓటిటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం.జూన్ 2 నుంచి ఈ సినిమా ఓటిటీ లో స్ట్రీమింగ్ కానుంది.ప్రముఖ ఓటిటీ సంస్థ ఈ విషయాన్నీ బుధవారం అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here