Home » సినిమా » సర్కారు వారి పాట సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

సర్కారు వారి పాట సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరైన పరుశురాం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.యువత,ఆంజనేయులు,సోలో,గీత గోవిందం వంటి డిఫరెంట్ స్టోరిల సినిమాలతో ప్రస్తుతం పరుశురాం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.పరుశురాం దర్శకత్వం వహించిన గీత గోవిందం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా చుసిన ప్రతి హీరో కూడా పరుశురాం తో ఒక్క సినిమా అయినా చేయాలనీ అనుకుంటారు.ఆ అవకాశం మహేష్ బాబు ముందుగానే పరుశురాం కు ఇచ్చారు.గీత గోవిందం హిట్ సినిమా తర్వాతే పరుశురాం కు మహేష్ బాబు తో కలిసి వర్క్ చేయటానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడే ఆగిపోయింది.ఇక ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న చిత్రం వాయిదా పడి చివరకు మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్నారు.మరోవైపు దర్శకుడు పరుశురాం కూడా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.పరుశురాం పూరి జగన్నాధ్ కు కజిన్ అన్న విషయం అందరికి తెలిసిందే.ఈయన గీత ఆర్ట్స్ లో పని చేసేవారు.ఆ సమయంలోనే అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు పరుశురాం.ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ పాజిటివ్ గా ఉండడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఆనందంగా ఉన్నారు.ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్న చిత్రం మహేష్ సర్కారు వారి పాట.

allu arjun rejected sarkaru vaari paata movie

ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకు మొదటి పది రోజు అదనపు షోలు వేసుకోవచ్చని ప్రకటించారు.ఇక ఏపీ లో రూ 45 మరియు తెలంగాణలో రూ 50 పెంచుకోవచ్చని చెప్పడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు పరుశురాం మొదట అనుకున్న హీరో మహేష్ బాబు కాదట.తనకు గీత కాంపౌండ్ ఎంతో సహాయం చేయడంతో అల్లు అర్జున్ హీరోగా గీత కాంపౌండ్ లో ఈ సినిమా చేయాలనీ అనుకున్నారు పరుశురాం.అయితే అదే సమయంలో బన్నీ పుష్ప సినిమాకు ఓకే చెప్పడంతో ఈ కథ సూపర్ స్టార్ మహేష్ వద్దకు వెళ్ళింది.పాన్ ఇండియా అప్పీల్ లేకపోవడంతో బన్నీ పుష్ప వైపే ఇంటరెస్ట్ చూపించారు.ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *