Allu Arjun: ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.దింతో అల్లు అర్జున్ కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు,రాజకీయ వేత్తలు,సామాన్యులు సైతం అభినందనలు తెలిపారు.దేశవ్యాప్తంగా బన్నీ పేరు మారుమోగిపోతుంది.ఇక దేశవ్యాప్తంగా బన్నీ ప్రతి మూమెంట్ తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో సంథింగ్ స్పెషల్ ఉండనుందని తెలిపారు.దాంతో ఆయన అభిమానులు బన్నీ చెప్పబోయే ఆ స్పెషల్ న్యూస్ ఏంటి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా బన్నీ తానూ ప్రతి రోజు ఏం చేస్తారు అనేది తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో వీడియొ షేర్ చేసారు.హోమ్ టూర్ వీడియొ ను షేర్ చేసిన బన్నీ తానూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం ఏం చేస్తారు అనేది ఈ వీడియొ లో చూపించారు.ఉదయం నిద్ర లేచిన వెంటనే గార్డెన్ లో యోగ చేయడం..ఆ తర్వాత తన పిల్లలతో వీడియొ కాల్ మాట్లాడటం..పుష్ప షూటింగ్ సెట్ కు వెళ్లడం..షూటింగ్ లో పాల్గొనడం ఇలా అన్ని విషయాలను వీడియొ లో చూపించారు బన్నీ.ఈ వీడియొ లో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్,హీరో కాస్ట్యూమ్స్ ఇలా అన్నిటిని చూపిస్తూ దర్శకుడు సుకుమార్ తో తనకు 20 ఏళ్ళ బంధం ఉందని..ఈ సినిమా తనకు 20 సినిమా బన్నీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియొ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతుంది.ఇది ఇలా ఉంటె సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి కె ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచేసింది.ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా,రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.యెర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయినా సంగతి తెలిసిందే.ఇక పుష్ప రెండవ భాగం కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇటీవలే పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్,ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ ఫిలిం అవార్డును సొంతం చేసుకున్నారు.
View this post on Instagram