Allu Arjun: రామ్ చరణ్ కూతురికి ఎవ్వరు ఊహించలేని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన అల్లు అర్జున్..!

NEWS DESK
1 Min Read

Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసన దంపతులకు పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అయ్యింది.ఈ దంపతులు 11 సంవత్సరాల తర్వాత ఇటీవలే ఒక కూతురికి జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.11 ఏళ్ళ తర్వాత మెగా వారసురాలు రావడంతో మెగా కుటుంబంలో సంతోషాలజల్లు కురుస్తున్నాయి.చిన్నారికి ఇటీవలే బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు మెగా ఫామిలీ.అయితే ఈ చిన్నారికి క్లిన్ కార కొణిదెల అని నామకరణం చేసినట్లు చిరంజీవి తెలిపారు.సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినిమా తారలు చిన్నారికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే శర్వానంద్,ఎన్టీఆర్ చిన్నారికి గోల్డ్ గిఫ్ట్ గా పంపడం జరిగింది.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కోడలికి ఎవ్వరు ఊహించని గిఫ్ట్ పంపించారంటూ వార్తలు వస్తున్నాయి.అల్లు అర్జున్ పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి రామ్ చరణ్,ఉపాసన ఫిదా అయ్యారట.ఇక అల్లు అర్జున్ తన కోడలి కోసం ఏం గిఫ్ట్ పంపించారంటే..అల్లు అర్జున్ తన కోడలు క్లింకార కోసం బంగారు పలకను గిఫ్ట్ గా పంపించారు.

చిన్నారి పేరు,ఆమె పుట్టిన తేదీ వివరాలు ఆ పలకపై వచ్చేలా డిసైన్ చేయించారట అల్లు అర్జున్.దాంతో బన్నీ అభిమానులు అల్లు అర్జున్ ఏది చేసిన స్టైలిష్ గా ఉంటుందని అందుకే ఆయన ఐకాన్ స్టార్ గా ఎదిగారని మురిసిపోతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..ఆయన సుకుమార్ దర్శకత్వం లో ప్రస్తుతం పుష్ప రెండవ భాగంలో నటిస్తున్నారు.ఇక పుష్ప మొదటి భాగం బిగ్గెస్ట్ హిట్ తర్వాత రెండవ భాగం మీద ప్రేక్షకులలో విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *