ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన నటనతో,డాన్స్ తో తనకంటూ అభిమానులలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.ఇటీవలే తాజాగా రిలీజ్ అయినా పుష్ప చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రెకార్డ్ ను క్రియేట్ చేస్తుంది.అయితే బన్నీ కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా ఒక 12 సినిమాలకు పైగా బన్నీ వదులుకోవడం జరిగింది.అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.మరికొన్ని అనుకున్నంత విజయం సాధించలేక పోయాయి.అయితే అల్లు అర్జున్ కొన్ని సినిమాలు కథలు నచ్చక వదిలేసినా,మరికొన్ని సినిమాలు కొన్ని కారణాల వలన రిజెక్ట్ చేయడం జరిగింది.అలా వదులుకున్న సినిమాలు ఏంటంటే…
జయం :
అల్లు అర్జున్ ను హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ అల్లు అరవింద్ భావిస్తున్న సమయంలో,బన్నీ బాధ్యతలను తేజ కు అప్పగించాలని అనుకున్నారు అల్లు అరవింద్.దాంతో తేజ మొదట జయం సినిమా అల్లు అర్జున్ తో చేయాలనీ అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడంతో నితిన్ అదే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
భద్ర:బోయపాటి శ్రీను మొదట భద్ర కథను అల్లు అర్జున్ కు వినిపించడం జరిగింది.కానీ అదే సమయంలో బన్నీ ఆర్య సినిమా చేస్తుండడంతో కొన్ని కారణాల వలన రిజెక్ట్ చేయడం జరిగింది.
100 % లవ్:సుకుమార్ మొదట ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించారు కానీ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసారు.మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పుష్ప రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
కృష్ణాష్టమి:ఈ సినిమా కథను బన్నీ కోసం సిద్ధం చేసాడు దర్శకుడు వాసు వర్మ.దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాలి అనుకున్నారు.దిల్ రాజు రిజెక్ట్ చేయడం తో సునీల్ తో ఈ సినిమా చేయడం జరిగింది.
పండగ చేస్కో:గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట అల్లు అర్జున్ తో చేయాలనీ అనుకున్నారు.కానీ ఎందుకొ బన్నీ నో చెప్పడం రామ్ తో చేసారు.
అర్జున్ రెడ్డి:సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథను ముందుగా అల్లు అర్జున్ కు వినిపించడం జరిగింది.కానీ అల్లు అర్జున్ ఈ సినిమా చేయడానికి ధైర్యం చూపించక పోవడంతో అదే సినిమాను విజయ్ దేవరకొండ తో చేసారు.
గ్యాంగ్ లీడర్:విక్రమ్ కె కుమార్ మొదట ఈ కథను అల్లు అర్జున్ కు వినిపించారు.మొత్తం ఓకే అయ్యింది అనుకున్నారు కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ డ్రాప్ అవ్వడంతో నాని తో ఈ సినిమా చేసారు.
డిస్కో రాజా:మొదట ఈ కథను అల్లు అర్జున్ కు వినిపించాడు దర్శకుడు కానీ అల్లు అర్జున్ ఈ కథకు కనెక్ట్ కాకా పోవడంతో రవితేజ తో ఈ సినిమా చేసారు.
గీత గోవిందం:మొదట ఈ కథ విన్న అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో తన స్టార్ ఇమేజ్ కు ఈ కథ అడ్డు వస్తుందని భావించి అల్లు అర్జున్ నో చెప్పడం జరిగింది.
జాను:తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనీ భావించారు దిల్ రాజు.కానీ ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీ కి తానూ సెట్ అవ్వనని అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం జరిగింది.
బొమ్మరిల్లు:ముందు ఈ సినిమా కథను విన్న అల్లు అర్జున్ ఓకే కూడా చెప్పారు.కానీ అదే టైం లో హ్యాపీ సినిమా తో బిజీ గా ఉండడంతో అల్లు అర్జున్ ఈ సినిమాను వదులుకున్నారు.సిద్ధార్థ్,జెనీలియా కంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.