అమ్మోరు సినిమా చిన్నారి సునయన ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

Ammoru Child Artist Sunaina Badam

అప్పట్లో కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరు చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
1995 లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ చిత్రం సంచలన రికార్డులను నమోదు చేసింది.ఈ చిత్రం ఇప్పటికి కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రంలో స్వర్గీయ నటి సౌందర్య,సురేష్ నటించారు.కళ్ళు చిదంబరం,రామిరెడ్డి,రమ్య కృష్ణ పలువురు ప్రధాన పాత్రలలో కనిపించారు.

ఇక ఈ చిత్రంలో అమ్మోరుగా నటించిన చిన్నారి సునయన.ఈ చిత్రంతో ఈ చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది.ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అప్పట్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఇక ఈ చిత్రంలో అమ్మోరు పాత్రలో నటించిన చిన్నారి సునయన విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంది.

Ammoru Child Artist Sunaina Badam
Ammoru Child Artist Sunaina Badam

ప్రస్తుతం సునయన ఫ్రేస్టేటెడ్ ఉమెన్ పేరుతొ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.సునయన ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓహ్ బేబీ అనే చిత్రంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది.ఓహ్ బేబీ చిత్రం లో సమంత లీడ్ రోల్ లో కనిపించిన సంగతి అందరికి తెలిసిందే.బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.సునయన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు ఒక పాప ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *