ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ యాంకర్లలో అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు కామెడీ షోలు,ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు సినిమా అవకాశాలతో కూడా ఫుల్ బిజీ గా ఉంది.అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా లో నెగటివ్ రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.పుష్ప రెండవ భాగంలో కూడా అనసూయ పాత్ర కొనసాగుతుంది.
అయితే పుష్ప రెండవ భాగంలో ఆమె పాత్ర చాల పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం.అనసూయ దర్జా సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనుంది.ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా టీజర్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో అనసూయ లేడీ రౌడీ పాత్ర పోషించింది.ఈ సినిమాతో అనసూయ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ చిత్రంలో అనసూయ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనుందని సమాచారం.ఈ సినిమాలో అనసూయ మేక్ ఓవర్ కూడా కొత్తగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కోసం ఆమె రూ.25 లక్షలు తీసుకుంటుందని సమాచారం.ఈ చిత్రానికి ఆమె ఎక్కువ కాల్ షీట్స్ కూడా తీసుకోకుండా తక్కువ రోజుల్లోనే చిత్రీకరించారట.ఈ చిత్రం కోసం అనసూయ 25 లక్షలు డిమాండ్ చేయడం నిర్మాతలు ఒప్పుకోవడం విశేషం అని చెప్పచ్చు.ఈ సినిమా అనసూయ కు ఎలాంటి పేరు తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే.