Anasuya Bharadwaj : అందంలో యాంకర్ అనసూయ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గరు అని చెప్పచ్చు.పేరుకు పిల్లల తల్లి అయినా కూడా తన గ్లామర్ విషయంలో మాత్రం స్వీట్ సిక్స్టీన్ అన్నట్లు మైంటైన్ చేస్తూ ఉంటుంది అనసూయ.బుల్లితెర మీద ప్రస్తుతం పోటీ పడుతున్న గ్లామరస్ యాంకర్ లలో అనసూయ కూడా ఒకరు అని చెప్పచ్చు.సోషల్ మీడియాలో కూడా ఈమెకు చాల క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.ఈమె గ్లామర్ కు మిళియన్లలో ఫాలోయింగ్ ఉంది.
జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ అనసూయ పెద్ద ఎసెట్ అని చెప్పచ్చు.గత సంవత్సరం అనసూయ కథనం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం జరిగింది.
మీకు మాత్రమే చెప్తా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఈమె కీలక పాత్రలో కనిపించడం జరిగింది.ప్రస్తుతం అనసూయ కృష్ణ వంశి దర్శకత్వంలో రంగమార్తాండం సినిమా లో బోల్డ్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
మరాఠీ సినిమా అయినా నటసామ్రాట్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ,బ్రమ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.