Anasuya: అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండే సెలెబ్రెటీలలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.తాజాగా అనసూయ షేర్ చేసిన వాషింగ్టన్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.
అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నాయి.ఒక్కప్పుడు బుల్లితెర మీద తన యాంకరింగ్ తో తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అందరిని మెస్మరైజ్ చేసింది.ఆ తర్వాత అనసూయ కు సినిమాలలో కూడా అవకాశం రావడంతో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి వెండి తెర మీద కూడా తన టాలెంట్ ను చూపించింది.
ప్రస్తుతం అనసూయ సినిమా అవకాశాలతో బిజీ గా ఉండడంతో బుల్లితెర మీద షో లకు దూరంగా ఉంటుంది.ఈ ఏడాది ఆమె నటించిన రంగమార్తాండం,విమానం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక అనసూయ పుష్ప రెండవ భాగంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇలా సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటూనే అనసూయ తన గ్లామర్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ కుర్రాళ్లకు తన అందంతో నిద్ర లేకుండా చేస్తుంది.
View this post on Instagram