జబర్దస్త్ షో ద్వారా చాల క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర మీద షోస్ కు యాంకర్ గా,జడ్జి గా బుల్లితెర క్వీన్ గా రాణిస్తున్న అనసూయ సినిమాలలో కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు.క్షణం,రంగస్

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్,లేటెస్ట్ ఫోటోలు,వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఎల్లప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటారు.తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా అయినా ఇంస్టాగ్రామ్లో తన మేక్ అప్ లేని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.గతంలో కూడా ఆమె మేక్ అప్ లేకుండా ఫోటోలు షేర్ చేయడం అలాగే లైవ్ లో వీడియొ చాట్ చేయడం వంటివి కూడా చేసారు.ప్రస్తుతం ఆమె ఇంట్లో మేక్ అప్ లేకుండా దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

మేక్ అప్ లేని ఫోటోలలో కూడా అనసూయ చాల అందంగా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా అయితే సెలెబ్రెటీలు మేక్ అప్ లేకుండా ఫోటోలు షేర్ చేయడానికి భయపడతారు.కానీ ఇలాంటి విషయంలో అనసూయ అందరికి భిన్నం అని చెప్పచ్చు.ఇక అనసూయ మేక్ అప్ తో ఫోటోలని కాకుండా మేక్ అప్ లేని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.ప్రస్తుతం అనసూయ పుష్ప పార్ట్ 2 ,రంగ మార్తాండం అనే సినిమాలలో నటిస్తున్నారు.




