Anasuya: అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.మొన్నటి వరకు బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా రాణించిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.ఇటీవలే అనసూయ కృష్ణ వంశి దర్శకత్వం వహించిన రంగమార్తాండం సినిమా లో ప్రకాష్ రాజ్ కు కోడలిగా నటించి మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.ఈ సినిమాలో ఆమె పాత్ర చూస్తే ఎవ్వరికైనా కోపం రావాల్సిందే.
అయితే ఈ పాత్ర నెగటివ్ రోల్ అనుకోడానికి లేదు.అనసూయ ను ఇలాంటి షెడ్ లో చూడటం కొత్త అని చెప్పచ్చు.ఈ పాత్ర అందరికి గుర్తుండిపోయే పాత్ర అని తెలుస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.ఒక్కోసారి ఈమె వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక అనసూయ మరియు విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే.మే 15 న అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు ఈ టాపిక్ ను ట్రెండ్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియ జేశారు.అనసూయ తన పుట్టిన రోజును తన ఫ్యామిలీ మెంబెర్స్ తో సింపుల్ గా జరుపుకున్నారు.వాటికీ సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేసి తనకు విషెస్ తెలిపిన వారికి థాంక్స్ చెప్పారు అనసూయ.
1.

2.
3.