Anasuya: అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన గ్లామర్ తో యాంకరింగ్ తో బుల్లితెర మీద మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది అనసూయ.ఈమెకు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.ఈమెకు సంబంధించిన ఫోటోలు అయినా వీడియోలు అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.
అనసూయ కూడా సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటారు.తనకు సంబంధించిన షో అప్ డేట్స్,మూవీ అప్ డేట్స్ లతో పాటు తన హాట్ హాట్ ఫోటోలను,డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.ఎప్పుడు హాట్ హాట్ డ్రెస్ లో ఫోటో షూట్ చేస్తూ అనసూయ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటారు.ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన డాన్స్ వీడియొ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
బుల్లితెర మీద షో లతో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న అనసూయ సినిమాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకుంది.సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అనసూయ.ప్రస్తుతం ఈమె సుకుమార్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అటు షో లతో పాటు ఇటు సినిమాలతో కూడా బిజీ బిజీ గా గడుపుతుంది అనసూయ.