Anasuya: జబర్దస్త్ కామెడీ షో లో తన చలాకి మాటలతో ఆకట్టుకునే అందంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ.అనసూయ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయ కు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పచ్చు.ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ప్రేక్షకులను బాగా అలరించింది.ఇక ఆ తర్వాత ఒక పక్క యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క వరుసగా సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం అనసూయ లేకుండ ఏ సినిమా కూడా లేదు అని చెప్పచ్చు.
అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాలో కూడా అనసూయ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.సుకుమార్ దర్శకత్వం వహించే పుష్ప 2 సినిమా లో అనసూయ పాత్ర కీలకం అని తెలుస్తుంది.ప్రస్తుతం అనసూయ వరుసగా సినిమాలతో బిజీ గా ఉన్న కూడా సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువలో ఉంటుంది.అనసూయ తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ నటించిన రజాకార్ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేసారు మూవీ మేకర్స్.అనసూయ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక తాజాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అనసూయ పాల్గొనడం జరిగింది.ఈ సినిమాను బిజెపి నాయకుడు నిర్మిస్తుండడంతో అనసూయ రాజకీయాల్లోకి వస్తుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అనసూయ రాజకీయాల్లకి వస్తుంది అంటూ అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా దీనిపై స్పందించిన అనసూయ క్లారిటీ ఇవ్వడం జరిగింది.రీసెంట్ గా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ కు జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడగడం జరిగింది.మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అనసూయ మాట్లాడుతూ రాజకీయం నా వల్ల కాదు…చెప్పాలంటే నాకు ఆ ఇంటరెస్ట్ లేదు.రాజకీయ నాయకుల పని వాళ్ళను చేయనిద్దాం..అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram