బుల్లితెర మీద తన యాంకరింగ్ తో సందడి చేసి అందరిని ఆకట్టుకునే అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు.ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ తో కనిపిస్తూ అభిమానులను మాయ చేస్తుంటారు అనసూయ.సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫాలోయింగ్ బాగా ఉంది.ప్రస్తుతం అనసూయ అటు యాంకరింగ్ తో మరియు వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ గా అయిపొయింది.అయితే యెంత బిజీ గా ఉన్న సరే ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఆమె దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
బుల్లితెర మీద జెమినీ,ఈటీవీ,జీ తెలుగు ఇలా దాదాపుగా అని చానెల్స్ లోను అనసూయ షో లు చేయడం జరిగింది.అయితే ఎక్కువగా అనసూయ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.తాజాగా అనసూయ స్టార్ మా లో ప్రసారం అయ్యే ఒక కొత్త షో కు యాంకర్ గా రానుంది.అనసూయ తో పాటు ఈ షో లో సుధీర్ కూడా కనిపించనున్నాడు.స్టార్ మా ఛానల్ లో సూపర్ సింగర్ జూనియర్ అంటూ ఒక కొత్త చిన్న పిల్లల పాటల కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ షో లో అనసూయ,సుధీర్ లతో పాటు మనో,చిత్ర,ఉషా ఉత్తుప్,హేమ చంద్ర,రెవీణా రెడ్డి కూడా కనిపించనున్నారు.ఈ షో కు వస్తున్నా పిల్లలు మాత్రం చిచ్చర పిడుగుల్లా ఉన్నారు.పిల్లలు అనసూయ ను దారుణంగా ఆడేసుకున్నారు.అనసూయ ను ఆంటీ సుధీర్ ను అన్న అని అనేసారు.అనసూయ ను ఆంటీ అనడంతో ఆమె తెల్ల మొహం వేసేసింది.ఇంకో బుడ్డోడు అనసూయ డాన్స్ చేస్తే …డాన్స్ వేయమంటే ఇలా కోతిలా ఎగురుతుందేంటీ అంటూ సెటైర్ కూడా వేసాడు.పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని సుధీర్ అనడంతో అక్కడ ఉన్న వారంతా పగల బడి నవ్వేశారు.