‘జబర్దస్త్’ ఫేమ్ అనసూయ భరధ్వాజ్ అందంతో పోత పోసినట్టుండే రూపం ఆమెది. యాంకర్ గా బుల్లితెరనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా చేస్తూ కూడా మెప్పిస్తోంది. అప్పుడప్పుడూ ఐటం సాంగ్స్ చేస్తూ కుర్రాళ్ల ఫాలోయింగ్ ను కూడా కాపాడుకుంటుంది. అసలు హాట్ బ్యూటీ అయిన అనసూయ ఐటం సాంగ్స్ చేస్తే ఇక చూసే కుర్రకారు ఉర్రూతలూగిపోక తప్పదు. కానీ అమ్మడు ఐటం సాంగులు తీసిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. ఆ ముద్ర వేసుకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచిగా రాణిస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.
సినిమాలు, షోలకే పరిమితం కాకుండా ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉందనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు ఫొటో షూట్లలో కూడా వావ్ అనుపిస్తుంది. తన అందాలను ఆరబోసేందుకు సై అంటుందట. ఆ ఫొటోలు కూడా ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. అనసూయ స్టార్ మాలో కూడా షో చేస్తుంది.

వీటితో పాటు పుష్ప-2తో పాటు క్రిష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగ మార్తాండలో కూడా ఆమె నటిస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్న ఒక వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మంచి మంచి ప్రాజెక్టులతో సొగసరి బిజిగానే ఉంటుంది.

సినిమాలను అటుంచితే హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంటుంది ఈ చిన్నది. అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన బ్యూటీ తన యాంకరింగ్ తో అక్కడి వారిని కట్టిపడేసింది. అక్కడ ఆమె తిరిగిన బీచ్ లు, రెస్టారెంట్లు, తదితర ప్రదేశాల ఫొటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆమె అందాల పిక్స్ ను నెటిజన్లు కన్నార్పకుండా చూస్తున్నారు.
