అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ షో మంచి పాపులారిటీని సంపాదించుకుంది అనసూయ.ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అనసూయ తనకు సంబంధించిన అన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఇదే క్రమంలో తాజాగా అనసూయ ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలలో అనసూయ లుక్ చూసి,ఫోజులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అనసూయ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.అయితే ప్రస్తుతం ఈ ఫోటోలను చూసి సో బ్యూటిఫుల్ అని చాల మంది కామెంట్స్ చేస్తున్న అక్కడక్కడా నెగటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.ఇటీవలే కాలంలో అనసూయ ఏ ఫోటో పెట్టిన కూడా నెగటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు.

ఓ నెటిజన్ అయితే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది ఆంటీ కి అంటూ కామెంట్ చేయడం జరిగింది.అయితే ఇలా వచ్చే నెగటివ్ కామెంట్స్ కు అనసూయ చాల సార్లు స్పందించడం జరిగింది.తన లైఫ్ స్టైల్ తనకు తెలుసనీ,ఎలా ఉండాలో ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదని అనసూయ చాల సార్లు చెప్పడం జరిగింది.బుల్లితెర మీద రాణిస్తూనే మంచి సినిమా అవకాశాలతో ముందుకు దూసుకుపోతుంది అనసూయ.
