తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఒక పక్క యాంకరింగ్ తో అందరిని అలరిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ పాత్రలు ఉన్న సినిమా లు చేస్తూ బిజీ గా దూసుకుపోతుంది అనసూయ.సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.ఆ తర్వాత క్షణం,పుష్ప ది రైజ్ సినిమాలతో కూడా హిట్స్ ను అందుకుంది.ఈ సినిమాలలో అనసూయ పాత్రకు మంచి స్పందన దక్కింది.అయితే తాజాగా అనసూయ బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్ గా రాబోతుంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అనసూయను స్టార్ మా లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ 6 లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ నిర్వాహకులు చాల ప్రయత్నాలు చేస్తున్నారట.అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచే అనసూయ ను కంటెస్టెంట్ తీసుకురావడానికి స్టార్ మా మరియు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ ఆఫర్ ను అనసూయ రిజెక్ట్ చేస్తూ వస్తుంది.ప్రస్తుతం అనసూయ సినిమాలతో షో లతో బిజీ గా ఉండడం వలన ఆమె కాల్ షీట్స్ కోసం పెద్ద పెద్ద దర్శకులే ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం అనసూయ బుల్లితెర మీద ప్రసారం అయ్యే చాల షో లతో బిజీ గా ఉంది.

వీటన్నిటి నుంచి ఆమెకు వచ్చే రెమ్యూనరేషన్ భారీ స్థాయిలోనే ఉంటుంది అని చెప్పచ్చు.ఇంతటి ఆదాయాన్ని వదులుకొని అనసూయ బిగ్ బాస్ లోకి వెళ్తే చాల నష్టపోతోంది అని చెప్పచ్చు.అయితే ఆమెకు పాపులారిటీ కూడా అవసరం లేదు.ఇక ఏ మాత్రం ఉపయోగం లేకుండా ఈ షో లో పాల్గొనడం టైం వేస్ట్ అన్నట్లు అనసూయ భావిస్తుంది అని సమాచారం.అయితే బిగ్ బాస్ టీం మాత్రం అనసూయ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఒక క్రేజీ ఆఫర్ తో బిగ్ బాస్ టీం అనసూయ ను సంప్రదించినట్లు సమాచారం.అయితే మూడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో గెస్ట్ కంటెస్టెంట్ గా ఉంటె కోటి రూపాయలు ఇస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.మరి అనసూయ ఈ ఆఫర్ ను ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.ఇక బిగ్ బాస్ 6 వ సీజన్ ఆగష్టు నెలలో ప్రారంభంకాబోతుందని సమాచారం.
