Anasuya: తెలుగు లో బుల్లితెర మీద యాంకర్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న గ్లామరస్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం సినిమాలతో కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది.సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన అనసూయ మొత్తం సినిమా ఇండస్ట్రీ దృష్టిని,ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది అనడంలో సందేహం లేదు.సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో మాత్రమే కనిపించే అనసూయ రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఆమెకు సినిమాలలో అవకాశాలు క్యూ కట్టాయి.
సినిమాలలో కీలక పాత్రలలో కూడా అనసూయ ప్రేక్షకులను మెప్పిస్తుంది.తాజాగా ఈ బ్యూటీ రజాకార్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో అనసూయ మాట్లాడుతూ తన ఏజ్ ను బయటపెట్టేసింది.సినిమా ఇండస్ట్రీలో అందమైన భామలు తమ ఏజ్ గురించి ఎవరైనా అడిగితె మాట దాటేస్తూ ఉంటారు.అయితే అనసూయ మాత్రం ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడుతూ 38 ఏళ్ళు వచ్చాయి నాకు అంటూ చెప్పేసింది.
అక్కడున్న విలేకర్లు మీరు ఫ్లోలో మీ ఏజ్ ఎంతో చెప్పేసారు అని అనడంతో నవ్వుతు సిగ్గు పడింది అనసూయ.ఈ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే తెలంగాణాలో 19 వ కాలంలో రజాకార్ల ఉద్యమం జరిగేది.తెలంగాణ ఆ సమయంలో ఎదురుకున్న సమస్యలు,చేసిన పోరాటాలు ఈ సినిమా ద్వారా ఇప్పటి వారికి తెలియజేయనున్నారు దర్శకుడు.బిజెపి నేత గూడూరు నారాయణ మూర్తి నిర్మిస్తున్న ఈ సినిమాకు యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్,పాట కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
View this post on Instagram