Anasuya Tattoo: అనసూయ భరద్వాజ్ అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ తన కు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు తన ఫ్యామిలీ విషయాలు కు పంచుకుంటుంది.ఇక ఇదే క్రమంలో తాజాగా తన ఒంటిపై ఉన్న టాటూ ల గురించి మాట్లాడుతూ వాటి అర్ధాన్ని వివరించింది.తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేర్లలో అనసూయ భరద్వాజ్ పేరు కూడా ఒకటి.జబర్దస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర మీద కూడా వరుస సినిమా లు చేస్తుంది.
ఇక సినిమాలతో యెంత బిజీ గా ఉన్న కూడా అనసూయ సోషల్ మీడియాలో సమయం దొరికినప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.బుల్లితెర మీద ఉన్న గ్లామరస్ యాంకర్ లలో అనసూయ పేరు టాప్ ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు.తన గ్లామరస్ ఫోటోలను వీడియొ లను నెట్టింట్లో షేర్ చేస్తూ ఎప్పుడు అభిమానులకు దగ్గర గా ఉంటుంది.తన చురుకైన మాటలతో తన అందంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ బ్యూటీ.18 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ హీరో గా నటించిన నాగ సినిమాతో స్క్రీన్ మీద కనిపించింది అనసూయ.ఆ తర్వాత న్యూస్ ప్రేసెంటెర్ గా ఇక జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

జబర్దస్త్ వేదికపై ఫుల్ హంగామా చేస్తూ మంచి పాపులారిటీని స్మపాదించుకుంది అనసూయ.వెండితెర మీద కూడా అవకాశం రావడం తో తన టాలెంట్ ను నిరూపించుకుంది అనసూయ.ప్రస్తుతం అనసూయ వెండితెర మీద వరుస సినిమా అవకాశాలతో బిజీ గా గడుపుతుంది.తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన అనసూయ తన ఒంటి పై ఉన్న టాటూ ల గురించి వివరించింది.మీ ఒంటి పై ఉన్న టాటూ ల గురించి చెప్పండి అని ఒక అభిమాని అడిగినప్పుడు తన ఒంటి పై రెండు టాటూలు ఉన్నాయని చెప్పింది.ఒకటి తన ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివెర్సరీ మా ఆయన బర్త్ డే ఒకేసారి రావడంతో వేయించుకున్నానని తెలిపింది.నిక్కు అని టాటూ వేయించుకున్నట్లు తెలిపింది అనసూయ.ఇక రెండోది కెలాన్ అంటే గ్రీకు భాషలో క్యారక్టర్ బ్యూటీ అని తెలిపింది అనసూయ.
View this post on Instagram