బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమా అవకాశాలతో కూడా అనసూయ తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది.ఇటీవలే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా పుష్ప సినిమాలో అనసూయ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే పుష్ప మొదటి భాగం కంటే కూడా అనసూయ పాత్ర పుష్ప రెండవ భాగంలో కీలకం కానుందని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో కూడా అనసూయ ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.ఇటీవలే తాజాగా అనసూయ మేకప్ లేకుండా షేర్ చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కొందరు అనసూయ చాల అందంగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం మేకప్ లేకుండా అనసూయ రూపం ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇదివరకు గతంలో కూడా అనసూయ మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను షేర్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.మేకప్ లో అనసూయ యెంత అందంగా ఉంటారో మేకప్ లేకుండా అంటే అందంగా ఉంటారు అని ఈ ఫోటోలను చూసి చెప్పవచ్చు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ అందుకుంటున్న అనసూయ కు క్రేజ్ బాగా ఉంది.సోషల్ మీడియాలో ఆమె ఏ ఫోటో పెట్టిన కూడా క్షణాల్లో వైరల్ అయిపోతాయి.అనసూయ నటించిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అవడంతో ఆమెకు అది ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు.సినిమాలలో రొటీన్ పాత్రలు కాకుండా భిన్నంగా ఉండే పాత్రలకు అనసూయ ఓకే చెప్తూ సక్సెస్ అందుకుంటున్నారు.అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ రాను రాను పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అని చెప్పచ్చు.
View this post on Instagram