తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ ఒకరు.సోషల్ మీడియాలో ఎప్పడూ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధిచిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుకుంటూ ఉంటారు.ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను ఫాలో అవుతూ తన అందంతో,మాటలతో యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఒకపక్క యాంకర్ గా అలరిస్తూనే మరోపక్క సినిమా అవకాశాలతో కూడా ఫుల్ బిజీ గా మారిపోయారు అనసూయ.ప్రస్తుతం యాంకర్ అనసూయ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటీవలే యాంకర్ అనసూయ నటించిన పుష్ప,ఖిలాడీ సినిమాలు రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఆ చిత్రాలలో యాంకర్ అనసూయ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
దాంతో అనసూయ మరొక అదిరిపోయే పాత్రలో కనిపించనున్నారని ఒక వార్త వినిపిస్తుంది.ప్రస్తుతం అనసూయ గాడ్ ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మ పాత్రకు మంచి గుర్తింపు లభించింది.దాంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయనే చెప్పచ్చు.పుష్ప మొదటి భాగం కంటే కూడా రెండవ భాగంలో అనసూయ పాత్ర ఎక్కువగా ఉంటుంది అనే చెప్పచ్చు.ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తున్న అనసూయ కు సంపత్ నంది నిర్మాణంలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం.ఈ సినిమాతో పాటు మరొక సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.జయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనసూయ లీడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించి సగం చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం.ఇక అనసూయ కొరటాల శివ,చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్నా ఆచార్య చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుంది.దింతో పాటు కృష్ణ వంశి దర్శకత్వం వహిస్తున్న రంగమార్తాండం అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించనున్నారు.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ ప్రధానపాత్రలలో కనిపించబోతున్నారు.మరాఠీ చిత్రం అయినా నటసామ్రాట్ అనే చిత్రం కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ చిత్రంలో అనసూయ దేవదాసీగా అంటే గుడిలో దేవుని ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో కనిపించబోతుంది సమాచారం.