Anasuya Bharadwaj: బుల్లితెర మీద షోలలో చాల మంది యాంకర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.అయితే యాంకర్ అనసూయ కు మాత్రం ప్రత్యేక క్రేజ్ ఉందని చెప్పచ్చు.బుల్లితెర మీద షోలలో ఆమె కనిపించడం తగ్గిపోయిన ఆమె హవా మాత్రం తగ్గడం లేదు అని చెప్పచ్చు.ఆమె కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వీడియొ అయినా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్.అనసూయ కూడా సోషల్ మీడియా లో బాగా ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అభిమానులతో షేర్ చేసు కుంటారు.
బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్లకు యెంత క్రేజ్ ఉంటుందో బుల్లితెర మీద యాంకర్ అనసూయ అంతే క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు,వీడియొ లకు నెటిజన్ల నుంచి స్పందన కూడా ఓ రేంజ్ లో ఉంటుంది.కొంత మంది ఆమెను ట్రోల్ చేసిన కూడా ఆమె అవి పట్టించుకోకుండా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది.రీసెంట్ గా ఆమె జబర్దస్త్ యాంకర్ గా తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం అనసూయ సినిమాలతో బిజీ గా ఉంది.ట్రావెలింగ్ అంటే చాల ఇష్టం ఉన్న అనసూయ ఎప్పుడు భర్త,పిల్లలతో టూర్స్ వెళ్తూ ఉంటారు.

ఇటీవలే ఆమె ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో రిలాక్స్ కోసం చిట్యాలలో ఒక ప్లాజా దగ్గర ఆగడం జరిగింది.ఆమె హోటల్ లోకి వెళ్లిన వెంటనే అక్కడున్న వైటర్స్ అందరు ఆమెను చూసి చాల ఎక్సయిట్ అయిపోయారు.అక్కడున్న వైటర్స్ అందరు కలిసి ఆమెను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించారు.ఈ క్రమంలోనే రా రా రాకమ్మా పాటకు అక్కడున్న వైటర్స్ తో కలిసి అనసూయ కూడా డాన్స్ చేసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియొ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.