
సినిమాలతో బిజీ గా ఉంటూనే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.కొన్ని కొన్ని సార్లు ఈమె ట్వీట్స్ కారణంగా పెద్ద వివాదాలు కూడా వస్తూ ఉంటాయి.ఈమె విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్లు ఎలాంటి వివాదాలకు కారణం అవుతున్నాయో అందరికి తెలిసిందే.
ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు మరియు అనసూయ మధ్య పెద్ద వార్ నడుస్తుందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈమె జిమ్ లో తన భర్త తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ గురించి ఈమె పోస్ట్ చేసిన తరువాత ఈమె జిమ్లో భర్త తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో ఈమె కావాలనే అటెన్షన్ కోసం ఇలా చేస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.