బుల్లితెర మీద మరియు వెండితెర మీద తమ టాలెంట్ ను చూపిస్తున్న యాంకర్ లు ఎవరైనా ఉన్నారంటే…అనసూయ భరద్వాజ్ అని చెప్పచ్చు.ఈ మధ్యకాలంలో తన గ్లామర్ డోస్ ను కాస్త పెంచిన అనసూయ ఎప్పటికప్పుడు వెరైటీ దుస్తులు ధరిస్తూ అందాలు ఆరబోస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తుంది.తాజాగా ఈమె సోషల్ మీడియా ప్లాట్ఫారం ఇంస్టాగ్రామ్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.సినిమాలలో వరుస అవకాశాలతో ఆమె జబర్దస్త్ కామెడీ షో కు కూడా గుడ్ బై చెప్పడం జరిగింది.కానీ ఆమె జబర్దస్త్ షో కు సంబంధించిన పాత వీడియోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి అనసూయ యాంకర్ గా చేసింది.ఆ తర్వాత ఆమె కొంత కాలం ఈ షోకు దూరం అయింది.అనసూయ స్థానంలో రష్మీ జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా చేసేది.ఆ తర్వాత మల్లి జబర్దస్త్ షో లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ మల్లి ఇంత కాలం తర్వాత ఆ షో కు గుడ్ బై చెప్పేసింది.జబర్దస్త్ షో లో అనసూయ డాన్స్ అందరిని బాగా ఆకట్టుకునేది.తాజాగా ఆమె జబర్దస్త్ షో లో చేసిన పాత డాన్స్ వీడియొ ఒకటి సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
యాంకర్ అనసూయ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆమె అందం మరియు ఆమె డాన్స్.సుకుమార్ దర్శకత్వంలో అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఆ తర్వాత పుష్ప సినిమాతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇటీవలే దర్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప రెండవ భాగంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
View this post on Instagram