రొమాంటిక్ సీన్ లో అదరగొట్టిన రష్మి.. మేకింగ్ వీడియో వైరల్..

మూవీ రిలీజ్ కు ముందు మేకింగ్ వీడియోలు కొన్ని లీక్ అవుతుంటాయి. వీటితో సినిమా హైప్ పెరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. ఇలా వచ్చిన చిన్న చిన్న వీడియోలు నెటిజన్లను, అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. తాజాగా హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. గ్లామరస్ గర్ల్ రష్మీ గౌతం, నందు జంటగా నటిస్తున్న మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. నవంబర్ 4న రిలీజ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. ట్రైలర్, సాంగ్స్ కూడా సినిమాపై మంచి హైప్ తెచ్చిపెట్టడంలో తోడ్పడ్డాయి.

రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ కు సంబంధించి ఓ వీడియో లీకైంది. ఈ మేకింగ్ సీన్ లో ఇద్దరూ యాక్టింగ్ లో లీనమై కనపించారు. బుల్లితెర యాంకర్ రష్మీ ఈ స్థాయికి వచ్చేందుకు ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. యాంకర్ గా చేస్తూనే వెండితెరపై కనిపించేందుకు అవకాశాల కోసం ఇండస్ర్టీలో చాలా కష్టపడింది. యాక్టింగ్ అంత ఈజీ కాదు.

ఇక రొమాంటిక్ సీన్లలో నటించడం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రష్మీ మంచి డెప్త్ ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మేకింగ్ వీడియో చూస్తే చీరకట్టులో చక్కగా కనిపిస్తుంది రష్మీ గౌతం. రొమాంటిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వెండితెరపై ఎంత మేరకు ఆడుతుందో చూడాలి. రష్మీ హీరోయిన్ గా ‘గుంటూరు టాకీస్’ వచ్చింది. ఇది మంచి హిట్ సాధించింది. ఇక ఈ మూవీపై అంతకంటే ఎక్కువ అంచాలు పెట్టుకుందని ఈ బ్యూటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *