బుల్లి తెరను ఏలే వారిలో ముందు వరుసలో ఉండేది యాంకర్లనే చెప్పాలి. సీరియల్స్ మినహాయించి. స్పెషల్ షోలో వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ కోవకు చెందిందే యాంకర్ శ్యామల. బుల్లి తెరపై పరిచయం అక్కర్లేని యాంకరనే చెప్పాలి. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంగ్ గా కూడా మెప్పించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మద్దుగుమ్మ. కొన్ని సినిమాలలో నటించినా సక్సెస్ కాలేక పోయింది. గ్లామర్ యాంకర్ గా మాత్రం ఆమె క్రేజ్ ఎప్పటికీ ఆమెదే.. గ్లామర్ విషయంలో హీరోయిన్లకు తీసిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది శ్యామల. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఆమె ఫొటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ముద్దుగా బొద్దుగా ఉన్న సదరు యాంకర్. ఇప్పుడు సన్నబడి నాజూగ్గా తయారైంది. జీరో సైజ్ మెయింటేన్ చేస్తుందా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ‘కొన్ని వారాలుగా వర్కవుట్ల చేస్తే ఇలా మారానంటూ’ ఆమె చేసిన పోస్టుతో ఆశ్చర్యపోతున్నారు.

సినిమాలలో అంత సక్సెస్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ను కాపాడుకుంటూ వస్తుంది ఈ నాజూకు సుందరి. ఇన్ స్టాలో మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమెకు ఉన్న ఆదరణ ఎంతో అర్థమవుతోంది. దీనికి తోడు ఆమె యూ ట్యూబ్ లో ఒక ఛానల్ కూడా మెయింటెన్ చేస్తుంది. యూ ట్యూబ్ లో తన న్యూ హౌజ్ టూర్ ను అప్లోడ్ చేసింది. నటుడు నర్సింహను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. తన ఫ్యాన్స్ కోసం రీసెంట్ గా శారీలో ఉన్న పిక్స్ పోస్టు చేసింది. తన గత చిత్రాలు, ప్రస్తుత చిత్రాలను పోస్ట్ చేయడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు నెటిజన్లు.
