Virupaksha: సాయిధరమ్ తేజ్ హీరోగా,సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవలే థియేటర్ లలో రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం ప్రముఖ ఓటిటీ అయినా నెట్ ఫ్లిక్ లో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది.కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఓటిటీ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటుంది.
ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా సంయుక్ మీనన్ మరియి రవి కిషన్ నటించిన సంగతి తెలిసిందే.విలన్ రోల్ లో సంయుక అద్భుతంగా నటించింది అని చెప్పడం లో సందేహం లేదు.కార్తీక్ దండు రాసుకున్న ఈ కథలో ముందు మెయిన్ విలన్ గా యాంకర్ శ్యామలను అనుకున్నారట.
కానీ ఆ తర్వాత సుకుమార్ సూచనల మేరకు సంయుక్త ను మెయిన్ విలన్గా మార్చరట కార్తీక్ దండు.ఈ సినిమాలో యాంకర్ శ్యామల హీరో సాయి ధరమ్ తేజ్ కు అక్కగా నటించింది.ఈ సినిమాలో ఈమెది మలుపు తిప్పే పాత్ర.ఈ సినిమాలో ఈమె చనిపోయిన తర్వాతే హీరో తన అక్క చావుకు కారణం తెలుసుకోవడం జరుగుతుంది.అయితే చివరకు యాంకర్ శ్యామల మెయిన్ విలన్ పాత్రను మిస్ చేసుకుందని ఆమె అభిమానులు నిరాశపడుతున్నారు.