Anchor Suma: రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని పేరు సుమ కనకాల.బుల్లితెర మీద ఆమె బాగా పాపులర్.ఎంతటి పెద్ద సినిమా ఈవెంట్ అయినా కూడా అస్సలు బెదరకుండా షో ను రంజింప చేస్తూ సక్సెస్ ఫుల్ చేస్తారు సుమ.సుమ మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగింటి కోడలు అయి తన మాటలకూ అందరిని మైమరపిస్తారు.తాజాగా సుమ కనకాల తన తోటి యాంకర్లతో కలిసి ఓనం పండుగను ఘనం గా జరుపుకున్నారు.ఇక వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.సుమ తన చలాకైనా మాటలతో తెలుగు ప్రజలను 16 సంవత్సరాల నుంచి అలరిస్తున్నారు.
అందుకే తెలుగు ప్రజలు సుమ ను తమ ఇంట్లో అమ్మయి లా భవిస్తూ ఉంటారు.అంతగా సుమ ఫేమస్ అయ్యారు అని చెప్పచ్చు.ఇక సుమ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నప్పుడు యాంకర్ గా కాకుండా హీరోయిన్ గా అడుగు పెట్టారు.తెలుగు లో కల్యాణ ప్రాప్తిరస్తు సినిమా అలాగే మలయాళంలో పలు సినిమాలలో నటించిన సుమ కు మంచి బ్రేక్ రాలేదు.దాంతో ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు మొగ్గు చూపించారు.అలా యాంకరింగ్ లో ఎంట్రీ ఇచ్చిన సుమ ప్రస్తుతం టాప్ యాంకర్ గా రాణిస్తున్నారు.టీవీ మెగాస్టార్ గా పిలవబడుతున్న సుమ గత కొంత కాలం నుంచి ఒక అంటూ చిక్కని వ్యాధి తో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుమ కిలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపారు.ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో బాధలు,కష్టాలు పడినట్లు సుమ తెలిపారు.తన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తీసేయాలి అని తెలియని పరిస్థితుల్లో తన స్కిన్ కు ఈ డామేజ్ జరిగిందని,తర్వాత అది తగ్గడానికి ఎలాంటి ప్రత్యత్నాలు చేసిన ఫలితం రాలేదని తెలిపారు.కిలాయిడ్ టెండెన్సీ అంటే స్కిన్ మీద ఎక్కడైనా ఒక గాయం అయితే రోజు రోజుకు ఆ గాయం పెద్దదిగా చుట్టుపక్కల అంతా వ్యాపించి పెద్ద గాయం అవుతుందట.తాజాగా సుమ తన తోటి యాంకర్ లతో కలిసి ఓనం పండుగను ఘనం గా జరుపుకున్నారు.ఇక వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram