Anchor Suma: తెలుగు ప్రజలకు సుమ కనకాల పేరు గురించి పరిచయం అవసరం లేదు.టీవీ షోస్,సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్,ఇంటర్వూస్ ఇలా ఏవైనా సరే సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు.మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్,ప్రమోషన్స్ సుమ లేనిదే జరగవు అనే చెప్పాలి.తన కెరీర్ స్టార్ట్ అయినా కొత్తలో సుమ హీరోయిన్ గా చేసిన కూడా ఆ తర్వాత యాంకర్ గా మరీ తన మాటల చాతుర్యం తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.యాంకర్ గా పలు టీవీ షో లు,సినిమా ఈవెంట్స్ ఇలా ఒకటేంటి ఏ షో అయినా సరే సుమ ఉంటె చాలు సక్సెస్ అవుతుంది అని నిరూపించుకుంది.
యాంకర్ గా సుమ మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం సుమ యాంకర్ గా చేస్తూనే,నటిగా కూడా రాణిస్తుంది.జయమ్మ పంచాయితీ అనే సినిమాతో గత ఏడాది సుమ ప్రేక్షకులను అలరించింది.కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు అని చెప్పాలి.ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ వరుస గా సినిమాలలో నటిస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ లో నేపాటిజం గురించి అందరికి తెలిసిందే.
ఇదే క్రమంలో ప్రస్తుతం సుమ కనకాల కొడుకు హీరో గా రానున్నాడు.సుమ కొడుకు రోషన్ ఇప్పటికే పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం జరిగింది.ఇక ప్రస్తుతం రోషన్ సినిమాలలోకి హీరో గా రానున్నట్లు సుమ అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయినా ఈ సినిమా కోసం రోషన్ తన మేకోవర్ ను తీర్చిదిద్దుకునే పని లో ఉన్నట్లు సమాచారం.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.రవికాంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా తో తమ కొడుకు రోషన్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని సుమ,రాజీవ్ ప్లాన్ చేస్తున్నారట.
View this post on Instagram