కృష్ణం రాజు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈశ్వర్ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు ప్రభాస్.మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత ప్రభాస్,త్రిష జంటగా తెరకెక్కిన వర్షం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.వర్షం చిత్రం హీరో ప్రభాస్ కు మరియు త్రిష కు కూడా మంచి క్రేజ్ ను సంపాదించిపెట్టింది.ఆ తర్వాత అడవి రాముడు చిత్రంతో మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్.హిట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న సమయంలోనే చక్రం సినిమాతో ప్లాప్ అందుకున్నాడు ప్రభాస్.
చక్రం సినిమా అందిరితో నవ్వుతు ఉండాలి,అందరిని నవ్విస్తూ ఉండాలి అనే మంచి కథతో తెరకెక్కబడింది.ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలలో ప్రభాస్ నటన కూడా చాల బాగుందని చెప్పచ్చు.ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవడం జరుగుతుంది.ఇదే కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు తెరకెక్కబడిన చిత్రాలు అన్ని కూడా దాదాపుగా ప్లాప్ అవ్వడం జరిగాయి.ప్రేక్షకులు క్లైమాక్స్ లో హీరో విలన్ పై విజయం సాధించాలి అని అనుకుంటారు కానీ చివరిలో హీరో చనిపోవడాన్ని జీర్ణించుకోలేరు.
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చక్రం సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పచ్చు.భారీ అంచనాలతో విడుదల అయినా ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ప్లాప్ గా నిలిచి పోయింది.అయితే కృష్ణవంశీ ముందు ఈ సినిమా కథను చిరంజీవి,మహేష్ బాబు,గోపీచంద్ వంటి హీరోలకు వినిపించటం జరిగింది.వాళ్ళు రిజెక్ట్ చేయడంతో చివరకు ప్రభాస్ నో చెప్పలేక ఈ సినిమా చేసారు.అయితే అప్పట్లో ఈ సినిమా వద్దు ప్లాప్ అవుతుందని చాల మంది చెప్పిన కూడా ప్రభాస్ వినకుండా ఈ సినిమా చేశారట.అయితే నిజంగానే అందరు అనుకున్నట్టు గానే కథ బాగున్నా కూడా క్లైమాక్స్ కారణంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు.