టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయి. వారు ఏ రంగంలో రాణిస్తున్నా గుర్తించి మరీ వారికి తగ్గ క్యారెక్టర్ సెట్ చేసి మరీ వెండితెరపై మంచి రోల్ లో చూపెడుతారు టాలీవుడ్, కోలివుడ్ దర్శకులు నిర్మాతలు. అప్పటి గాయకుడు బాల సుబ్రహ్మణ్యం (బాలు) నుంచి ఎంతో మంది సింగర్లు సినిమాలో కూడా నటిస్తూ వస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులుగా సింగర్స్ చాలా బాగా రాణిస్తారని సునీతను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్నారి బాల నటిగా అరంగేట్రం చేసి తన కెరీర్ ప్రారంభించింది. నటనకు కొంత విరామం ప్రకటించి తనకు ఎంతో ఇష్టమైన సింగర్ గా ఎదగాలని కోరుకుంది. ఆమె పేరే ఆండ్రియా జెరేమియా.
ఆండ్రియా జెరేమియా తమిళ నేపథ్య గాయని. బానటిగా కొన్న చిత్రాల్లో నటించడంలో నటిగా కూడా గుర్తింపు పొందింది. ఇక సింగింగ్ ఆమెకు ఫెవరేట్ హాబీ. ఆండ్రియా రెండు కోలివుడ్ మూవీల్లో నటించింది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ‘పచ్చైకిలి ముత్తచారం’లో శరత్ తో కలిసి నటించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో మూవీలో ఒక పాట పాడిన ఆమెను డైరెక్టర్ అగ్ర నటీమణులు శోభన, సిమ్రన్, టబులను సంప్రదించి ‘పచ్చైకిలి ముత్తచారం’లో ఆండ్రియాకు మంచి పాత్ర ఇచ్చాడు.
గిరీష్ కర్నాడ్ ‘నాగమండల’ మూవీతో అరంగేట్రం చేసింది. 2006లో నటుడు శివతో కలిసి ఓ కాఫీ యాడ్ లో నటించింది. పొదిగై ఛానల్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్ లో కూడా కనిపించింది. ‘కంద నాల్ మదల్’ క్లైమాక్స్ లో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సింగర్ గా ఆమె రికార్డులు బాగానే ఉన్నాయి. పదేళ్ల వయసులో ‘యంగ్ స్టార్స్’ అనే జాక్సన్ ఫైవ్-స్టైల్ బృందంలో ఆమె ఒక సభ్యురాలు. అప్పటి నుంచి మ్యూజిక్ పై మక్కువ పెరిగింది ఆండ్రియాకు. హరీష్ జయరాజ్ స్వరపర్చిన తమిళ చిత్రాల్లో ఆమె పాడింది. అన్నియన్ (అపరిచితుడు) కన్నుమ్ కన్నుమ్ నోకియా పాడింది ఆండ్రియానే. వెట్టయ్యాడు, యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఓ బేబీ, మ్యాస్ర్టో ఇలయరాజా స్వరపరచిన పలు చిత్రాలకు కూడా ఆమె గాత్రం అందించారు.