Home సినిమా ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఆమె పక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి…ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ..

ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఆమె పక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి…ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ..

0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పటాస్ చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి.ఈయన ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తానూ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని సైట్ కొట్టేవారంట.కానీ ఆ తర్వాత ఆ అమ్మయిని కాకుండా అదే బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తన ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ ని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.అనిల్ రావిపూడి ప్రకాశం జిల్లాలోని యుద్ధనపూడి కి చెందిన వారు.కాలేజీ చదువుకునే రోజుల్లో అనిల్ రావిపూడి తన ఇద్దరు స్నేహితులు కలిసి ఒక నలుగురు అమ్మాయిలు ఉన్న బ్యాచ్ ను ఫాలో అయ్యేవారట.

ఆ బ్యాచ్ లో ఒక అమ్మాయిని అనిల్ రావిపూడి ప్రతిరోజూ చేసేవారట.కానీ ఆ అమ్మాయి స్టిక్ట్ అవడంతో స్పందించలేదు.ఆ తర్వాత అదే బ్యాచ్ లో ఉన్న మరొక అమ్మాయితో అనిల్ రావిపూడి వివాహం జరిగింది.అయితే అనిల్ రావిపూడి భార్య సందర్భం దొరికిన ప్రతిసారి తనని కాకుండా పక్క అమ్మాయిని చూసేవారని దెప్పి పొడుస్తూనే ఉంటారట.అయితే ఇప్పటి వరకు బయటకు రాని ఈ విషయం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో భాగంగా అనిల్ రావిపూడి అందరితో పంచుకున్నారు.

Anil Ravipudi
Anil Ravipudi

ప్రస్తుతం అనిల్ రావిపూడి భార్య తో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ హిట్ తర్వాత ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఎఫ్ 3 చిత్రం తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ చిత్రంలో బాలయ్య 50 సంవత్సరాలు వయస్సు ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.బాలకృష్ణ కు కూతురిగా యంగ్ హీరోయిన్ అయినా శ్రీలీలా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.హీరోయిన్ గా నయనతార పేరు పరిశీలనలో ఉందని వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here