సోషల్ మీడియా విసృతంగా నడుస్తున్న జమానా ఇది. బుల్లి తెర, వెండితెర నటులు సందర్బోచితంగా దీన్ని వాడుకుంటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొందరు వినియోగిస్తుంటే.. చేతిలో ప్రాజెక్టులు లేక ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందేమోనని భయంతో కాపాడుకునేందుకు మరికొందరు యూజ్ చేస్తున్నారు. తమ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అందాలను మీమూ చూపుతాం అంటున్న వారు కొందరున్నారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు.
డబ్ స్మాష్ వీడియోలు, రీల్స్ తో ఫేమ్ సంపాదించుకున్న అషు రెడ్డి మొదట బుల్లి తెర అవకాశాలను దక్కించుకుంది. కొన్ని షోలకు కూడా యాంకర్‌గా పని చేసింది. తెలుగు బిగ్ బాస్ షోతో అషు క్రేజ్ అమాంతం పెరిగింది. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వూ కూడా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. చూడ్డానికి కొంచెం సమంతాలాగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. వీటితో ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న హీరోలతోనూ సినిమాలు చేసింది. హీరో నితిన్ తో జతగా ‘ఛల్ మోహనరంగ’లో నటించింది.
సోషల్ మీడియాను ఈ బ్యూటీ అప్పుడప్పుడు హీట్ చేస్తుంటుంది. తన పిక్స్, సన్నివేశాలు, తదితర విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. హాలిడేలో తను గడిపిన తీరు, బర్త్ డేలో జోష్, వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. బర్త్ డేకు తన తండ్రి కొనిచ్చిన కారును కూడా పోస్ట్ చేసి అభిమానులతో సందడి చేసింది అషు.
ఇవన్నీ ఒకెత్తయితే ఆమె ఆమె హాట్ పిక్స్ కుర్రకారును కన్ను తిప్పుకోకుండా చేస్తున్నాయి. రీసెంట్ గా కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో వదిలింది. టాప్ లెస్ ఫోజులతో కుర్రాళ్ల మతిపోగొట్టింది. కేవలం ఇన్నర్ వేర్ ధరించి రొమాంటిక్ లుక్స్ తో ఉన్న ఫోటోలు గూగుల్ కు వేడిని పెంచుతున్నాయి. ఈ బ్యూటీ అందాలు పీక్స్ అని కుర్రాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అషు అందాల సంద్రంలో అభిమానుల నుంచి కుర్రాళ్లు తడిచి ముద్దవుతున్నారు.