ఈ చిన్ననాటి ఫొటోలో ముద్దుగా ఉన్న క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా…

ప్రతి రోజు సోషల్ మీడియాలో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.మామూలుగానే అభిమానులు తమకు ఇష్టమైన హీరో,హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు కానీ లేటెస్ట్ ఫోటోలు కాని చాల భద్రంగా దాచుకునే వారు.ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తమకు ఇష్టమైన నటి నటుల ఫోటోలు కనిపిస్తే చాలు లైక్ లు షేర్ లు చేస్తుంటారు.అభిమానులు తమకు ఇష్టమైన హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు కనిపించిన ప్రతిదీ వదలకుండా షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఓ క్రేజ్ ఉన్న అందాల తార చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.ఈ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మజ్ను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమాన్యుల్.ఈ చిత్రంలో అను ఇమాన్యుల్ న్యాచురల్ స్టార్ నాని కు జోడిగా నటించింది.మొదటి సినిమాతోనే తన అందంతో అభినయం తో మంచి గుర్తింపు తెచ్చుకొని సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.అయితే ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అందుకోలేక పోయింది అను ఇమాన్యుల్.తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.అయితే తమిళ్ లో కూడా అనుకున్నంత క్లిక్ అవ్వలేకపోయింది.ప్రస్తుతం అను ఇమాన్యుల్ అల్లు శిరీష్ కు జోడిగా ఒక సినిమా లో నటిస్తుంది.ఆ సినిమాతో మల్లి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *