YS Sharmila Son Engagement: ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం…హాజరైన ఏపీ సీఎం జగన్,పలువురు ప్రముఖులు..ఫోటోలు వైరల్

NEWS DESK
2 Min Read
YS Sharmila Son Engagement

YS Sharmila Son Engagement: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం ఈ నెల జనవరి 18 న హైదరాబాద్ గండిపేట లోని గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా జరిగింది.ఈ నిశ్చితార్ధ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకలో ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని చెప్పచ్చు.ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ మరియు సోదరి షర్మిల తో కలిసి దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.

YS Sharmila Son Engagement

ఈ వేడుకకు జగన్ తన సతీమణి భారతి రెడ్డి తో కలిసి హాజరయ్యారు.అట్లూరి ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం నిశ్చయం అయిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ క్రమంలోనే రాజారెడ్డి,అట్లూరి ప్రియా నిశ్చితార్ధం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

YS Sharmila Son Engagement

రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ అధినేతలను షర్మిల తన కుమారుడి నిశ్చితార్ధానికి ఆహ్వానించటం జరిగింది.ఈ నిశ్చితార్ధం వేడుకలో వైవి సుబ్బారెడ్డి,మేకపాటి రాజమోహన్ రెడ్డి,కెవిపి రామచంద్ర రావు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

YS Sharmila Son Engagement

ఏపీ సీఎం జగన్ తన సతీమణి తో కలిసి కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక అనంతరం ఏపీ సీఎం జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.ఎంతో ఆప్యాయంగా సీఎం జగన్ తన తల్లి విజయమ్మ,సోదరి షర్మిల తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

YS Sharmila Son Engagement

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *