Home » తాజా వార్తలు » విల్లు ఎక్కుపెట్టి…క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మంత్రి రోజా…

విల్లు ఎక్కుపెట్టి…క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మంత్రి రోజా…

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ తర్వాత ఒకరిద్దరు ఇప్పటి వరకు ఆ శాఖ బాధ్యతలు కూడా తీసుకోలేదు.కొందరు నిరసనలు కూడా తెలుపుతున్నారు.కొంతమంది తమ శాఖలకు సంబంధించి రివ్యూ లకు కూడా హాజరుకాలేదు.మంత్రి రోజా మాత్రం అందుకు భిన్నంగా ప్రాధాన్యత లేని శాఖే అయినా కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.రొజాగారికి ఆటలాడటం అంటే యెంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే.సీఎం జగన్ రోజాకు క్రీడా,పర్యాటక శాఖల బాధ్యతలను అప్పజెప్పారు.దింతో రోజా ఆయా శాఖలకు సంబంధించి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.విరామం లేకుండా ఏదో ఒక కార్యక్రమంలో బిజీ గా గడుపుతున్నారు రోజా.మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వివిధ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు రోజా.ఇటీవలే ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు.

పోటీలను ప్రారంభించడంతో పాటు అక్కడి విద్యార్థులతో బాస్కెట్ బాల్ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.విజయవాడలో తాజాగా శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను రోజా ప్రారంభించటం జరిగింది.నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు.అక్కడి విద్యార్థులతో కాసేపు సరదాగా అన్ని ఆటలు ఆడి అలరించారు.బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడి బంతిని బౌండరీలు దాటించారు.విల్లు ఎక్కు పెట్టి ఆర్చి లోను తన సత్తా చూపించారు.గతంలోనూ ఆమె తన నియోజకవర్గంలో క్రీడా పోటీలను ప్రారంభించి అక్కడి విద్యార్థులతో ఆటలు ఆడేవారు.

రోజాకు ఆటలంటే ప్రాణం అని ఆమె చాల సందర్భాలలో చెప్పడం జరిగింది.తాజాగా విజయవాడ వేసవి శిక్షణ శిబిరంలో మాట్లాడిన ఆమె కరోనా కారణంగా రెండు సంవత్సరాలు క్రీడాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారని తెలిపారు.క్రీడలు ఆరోగ్యాన్ని,అవార్డులను తెచ్చి పెడతాయి అని ఆమె తెలిపారు.అయితే ఈ వేసవిలో 48 విభాగాలలో క్రీడలను రాష్ట్రంలో 1670 సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తున్నాం అని తెలిపారు.ఈ వేసవి శిక్షణ శిబిరాల కారణంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని ఆమె హామీ ఇచ్చారు.వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.క్రీడా ప్రాంగణాలు ఎక్కడైనా ఆక్రమణలకు గురై ఉంటె వాటిని సంరక్షించి అభివృద్ధి చేస్తామని రోజా తెలిపారు.

ఆ తరువాత రోజా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది.మంత్రి రోజా కెబిఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.ఇక్కడ 500 మందికి పైగా రక్తదానం చేయడం చాల గొప్ప విషయం అని తెలిపారు.యువత సేవాభావంతో ఉండటం మంచి విషయం అని తెలిపారు.ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుంది.రక్తం ఇవ్వడంతో పాటు అవయవదానం కూడా చెయ్యాలి.కరోనా టైములో రక్తం నిల్వలు తగ్గిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేసారు.యువతకు సీఎం జగన్ అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *