Home తాజా వార్తలు నైరుతిరుతుపవనాల ప్రభావంతో ఏపీ లో మూడు రోజులు వర్షాలు…

నైరుతిరుతుపవనాల ప్రభావంతో ఏపీ లో మూడు రోజులు వర్షాలు…

0

భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్,కోస్త ఆంధ్రప్రదేశ్,ఒడిశా,పశ్చిమ బెంగాల్,వాయవ్య బంగాళాఖాతం,జార్ఖండ్,బీహార్ లోని కొన్ని ప్రాంతాలు,ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ లోని కొన్ని భాగాలలో మరో రెండు రోజుల్లో విస్తరించనున్నట్లు పేర్కొంది.ఈ నైరుతిరుతుపవనాలు బరోడా,పోర్బందర్,చూర్క్,శివపురి,రెవ మీదుగా కొనసాగనున్నాయి.నిన్న విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగితే,ఈరోజు ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0 .9 కి మీ ఎత్తులో కొనసాగుతుంది.ఈ క్రమంలో రానున్న మరో మూడు రోజులలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది.

ఉత్తరకోస్తా,యానాం లలో ఈరోజు నుంచి మూడు రోజుల వరకు తేలిక పాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.ఒకటి రెండు ప్రాంతాలలో భారీ వర్షాలు,ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.దక్షిణ కోస్త లో కొన్ని ప్రాంతాలల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.రాయలసీమలో ఈ మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి కొన్ని చోట్ల ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here