ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటి వరకు చిరంజీవి తన సినిమాలో హీరోయిన్ మరియు డ్యూయెట్స్ లేకుండా సినిమా చేయడం అనేది ఇదే మొదటి సారి అని చెప్పచ్చు.పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సినిమా అయినా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కబడింది.ఎన్నో మార్పులు చేసి ఈ సినిమాను డిఫరెంట్ గా తెరకెక్కించారు దర్శకుడు మోహన్ రాజా.ఈ సినిమాలో చిరంజీవి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇక ఈ సినిమాలో చిరంజీవి తర్వాత అదే రేంజ్ లో పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్.ఎప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్న సత్యదేవ్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో హీరో చిరంజీవి కి పోటీగా నటించారు.మాములుగా చిరంజీవి లాంటి హీరో ముందు నిలబడి తడపడకుండా డైలాగ్స్ చెప్పడం అంటే మాములు విషయం కాదని చెప్పచ్చు.కానీ సత్యదేవ్ ఈ సినిమాలో చిరంజీవి కి పోటీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ముందు ఈ పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరో అయినా అరవింద్ గో స్వామి ని ఆనుకున్నారట.అరవింద్ గో స్వామి గతంలో రామ్ చరణ్ హీరో గా చేసిన సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించారు అని చెప్పచ్చు.కానీ అరవింద్ వేరే సినిమాలో బిజీగా ఉండడం వలన ఈ సినిమాను వదులుకోవలసి వచ్చింది.ఆ తర్వాత ఆ పాత్ర కోసం హీరో గోపీచంద్ ను కూడా సంప్రదించారట దర్శకుడు.అయితే హీరోగా కొనసాగుతున్న సమయంలో విలన్ గా చేస్తే ఆ స్టార్ స్టేటస్ దెబ్బతింటుందని రిజెక్ట్ చేశారట గోపీచంద్.ఆ తర్వాత సత్యదేవ్ ను సంప్రదించగా ఆయన ఓకే చేసారు.ఇక ఆ పాత్రను సత్యదేవ్ తప్ప మరెవరు చేయలేరు అనే రేంజ్ లో సత్యదేవ్ ఆ పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పచ్చు.
