తెలుగు టాప్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయింది హర్యానా గ్లోరి. ఆమె గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్క సారిగా టాప్ కు వెళ్లింది ఈ యాంకర్. ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీవి అరియానను బికిలో కనిపించాలంటూ కోరగా అమ్మడు లైట్ తీసుకుంది. అంత స్పోర్టీవ్ గా ఉంటుంది అరియానా.
ఆ తర్వాత ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఆకట్టుకుంది ఒకరకంగా బిగ్ బాస్ తోనే అమ్మడి కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాలి. ఈ మధ్యలో పలు షోస్, ఈవెంట్లూ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగానే ఉంటున్న ముద్దుగుమ్మ వెండితెరపైకి మాత్రం వెళ్లలేకపోతున్నానని ఆవేదనతో ఉందట. బిగ్ బాస్ షోలు, హాట్ హాట్ ఫొటో షూట్లతోనే వెండితెరకు వెళ్లలేవని అంటున్నారు నెటిజన్లు, సినీ అభిమానులు..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న గ్లోరీ. తన అందంతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. ఆమె ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. ఆఫర్ల కోసం కూడా కావచ్చని సినీ ఇండస్ర్టీ. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఆమె ‘బోల్డ్ గా ఉండడం క్రైమ్ కాదు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చిందంట.

ఈ ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆఫర్లు దక్కాలంటే అందంతో పాటు అభినయం ఇంపార్టెంట్ అనడమే కాకుండా ఒక్క బిగ్ బాస్ షో మాత్రమే చిత్ర సీమకు తీసుకుపోదూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన బెడితే ఈ సొగసరి సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తుందట. తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ట్రిప్పులమీద ట్రిప్పులు వేస్తుందట. పలు పర్యాటకా ప్రాంతాలను విజిట్ చేస్తూ అక్కడి దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ బాగానే అలరిస్తోంది అరియాన. దీంతో పాటు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
