Arjun Sarja: కోలీవుడ్ స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అర్జున్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు.అర్జున్ కు తెలుగులో కూడా బాగా క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్నాయి.తాజాగా లియో సినిమా లో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించారు అర్జున్.అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా కూడా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఐశ్వర్య,కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని కొన్ని వార్తలు సోషల్ మీడియా లో బాగా వినిపించాయి.వీరిద్దరి ప్రేమను ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించారని త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.తాజాగా వీరిద్దరి నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల మధ్యలో ఘనం గా జరిగింది.ఉమాపతి కూడా ప్రసుతం హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి నిశ్చితార్ధం వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరి వివాహం డిసెంబర్ లో జరగనుందని సమాచారం.హీరో అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.ఐశ్వర్య ను స్టార్ హీరోయిన్ గా చూడడానికి అర్జున్ చాల కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.అర్జున్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ హీరోగా,ఐశ్వర్య హీరోయిన్ గా ఒక సినిమా మొదలయ్యింది.ఈ సినిమా పూజ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో ఈ సినిమా పై ఒక హైప్ మొదలయ్యింది అని చెప్పచ్చు.అర్జున్,విశ్వక్ సేన్ మధ్య కొన్ని విభేదాల కారణంగా ఈ సినిమా ఆగిపోయింది అని సమాచారం.ఇక వేరే హీరో తో అర్జున్ ఈ సినిమాను చేస్తున్నారట.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram