అరుదైన వ్యాధితో భాదపడుతున్న ఒక చిన్నారికి తన వంతు సహాయం అందించటానికి మరోసారి ముందుకొచ్చారు సోను సూద్.మహారాష్ట్ర లోని నాగపూర్ కు చెందిన 16 నెలల విహాన్ అనే చిన్నారి స్పైనల్ మాస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.విహాన్ ప్రాణాలు దక్కాలంటే రెండు నెలల్లో 16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెప్తున్నారు.అంత ఖరీదైన ఇంజక్షన్ ఇప్పించే స్తొమత లేకపోవడంతో ఈ చిన్నారి తల్లితండ్రులు తమ బిడ్డను బతికించుకోవాలి అనే తాపత్రయంతో విరాళాలు చేపట్టారు.డాక్టర్ విక్రాంత్,మీనాక్షి తమ బిడ్డను బతికించుకోవడానికి సోషల్ మీడియా లో సన్నిహితుల ద్వారా విరాళాలు చేపట్టారు.
బాలీవుడ్ స్టార్స్ అయినా అభిషేక్ బచ్చన్,మనోజ్ బాజ్పాయ్ వంటి ప్రముఖులు ఈ చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఇప్పటి వరకు వచ్చిన నాలుగు కోట్ల రూపాయల విరాళాల్లో సోనూసూద్ దే ఎక్కువ భాగం ఉంది.ఇలా తన వంతు సహాయం అందించటమే కాకుండా ఆసుపత్రి కి వెళ్లి ఆ చిన్నారిని సోనూసూద్ పరామర్శించారు.సోనూసూద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ చిన్నారిని బ్రతికించటానికి ముందుకు రావాలని కోరారు.ఆపన్నహస్తం అందించటంలో నాగపూర్ ఆదర్శంగా నిలవాలి,క్రౌడ్ ఫండింగ్ వేదికలు,గోఫండ్ మిలో విరాళాలు అందచేసి లక్ష్యం చేరుకోవడంలో సహాయం చేయాలనీ కోరారు.
దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించి ఆ చిన్నారిని బతికించటంలో తమ వంతు సహాయం చేయాలనీ కోరారు.ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు సేకరించాము.ఇంకా 12 కోట్ల రూపాయలు సమకూర్చాల్సి ఉంది.అయితే ఈ అరుదైన స్పైనల్ మాస్కులర్ ఆత్రోపి వ్యాధికి జాల్ గెన్జ్ అనే ఖరీదైన ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది.అయితే అమెరికా లో ఉండే ఈ ఇంజక్షన్ కు 16 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.గతంలో కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారికి విరాళాలు సేకరించిన కూడా ప్రాణాలు దక్కలేదు.