వ్యక్తిత్వంలో ఇండస్ర్టీలో పవన్ కల్యాణ్ కు మంచి గుర్తింపు ఉంది. తన ఇద్దరు అన్నలు ఇండస్ర్టీలో ఉన్న సొంతంగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ టాలీవుడ్ లో గ్రేటెస్ట్ యాక్టర్ గా ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటున్నాడు పవన్. ఆయన ఈ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి బిజీగా మారిపోయారు. ఇది కొంత వరకు ఫ్యాన్స్ కు బాధాకరమే ఐనప్పటికీ తన అభిమాను సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో కూడా మార్పు తేవాలని భావించిన వారు లేకపోలేదు. ఇటీవల రాజకీయాల్లో ఆయన చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. వాటి గురించి మనకెందుకు కానీ తన మూడో భార్య అన్నా లెజినీవా గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అన్నా లెజినీవా 3 ఆగస్టు, 1980లో జన్మించారు. ఆమె రష్యన్ యువతి. ప్రముఖ మోడల్ కూడా. నటిగా కూడా చాలా సినిమాలలో చేశారు. క్రిస్టియన్ మతానికి చెందిన ఆమెకు పవన్ కల్యాన్ తో 2011లో పరిచయం ఏర్పడింది. తీన్మార్ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ లెజినీవాను చూశారు. ఆ సినిమాలో కూడా ఆమె నటించారు. అంతకు ముందే రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న పవన్ కల్యాణ్ లెజినీవాకు ప్రపోజ్ చేశారు. మూడేళ్ల వరకు వీరిద్దరూ డేటింగ్ ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో అప్పట్లో గుసగుసలు వినిపించేవి. 2013లో వీరు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.
ఆర్థికంగా ఆమె ఫిట్ గానే ఉంది. ఎకనమిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజినీవా ఆస్తుల విలువ దాదాపు రూ. 1800 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంత డబ్బుతో ఆమె ఒక బిలియనీరనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పుడు రష్యాలో ఉంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. వారి పిల్లలను మాత్రం సింగపూర్ లో చదివించాలనే వార్తలు వినిపస్తున్నాయి.